కొణిజర్ల: కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం సమీపాన మొక్కజొన్న పంట అవశేషాలకు గుర్తుతెలియని వ్యక్తులు గురువారం నిప్పంటించారు. దీంతో అవశేషాలే కాక చుట్టుపక్కల రైతుల చేన్లు, రోడ్డు వెంట పచ్చని చెట్లకు కూడా నిప్పంటుకుని కాలిపోయాయి. సమీపంలో రైతులు మొక్కజొన్న ఆరబోయగా, స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి చేరుకుని మంటలు ఆర్పడంతో నష్టం తప్పింది. ఈ సందర్భగా ఏఓ బాలాజీ పరిశీలించి మాట్లాడుతూ రైతులు అవశేషాలు కాల్చకుండా భూమిలో కలియదున్నాలని, తద్వారా ఎరువులు వేసే ఖర్చు తగ్గుతుందని అవగాహన కల్పించారు.
మొక్కజొన్న పంట దగ్ధం
కామేపల్లి: చేతికొచ్చిప మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు నిప్పుంటుకుని కాలిపోయింది. సాతానిగూడెం జీపీ పరిధి నారాయణపురానికి చెందిన బానోత్ వీరన్న, గుగులోత్ దుర్గాప్రసాద్ నాలుగెకరాల్లో మొక్కజొన్న సాగు చేసి కోతకు సిద్ధమయ్యారు. ఈక్రమాన నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఎకరాకు రూ.లక్ష చొప్పున నష్టం వాటిల్లిందని వాపోయారు. సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ ఉండడంతో షార్ట్ సర్కూట్ జరిగిందా, పక్క పొలాల మంట లు అంటుకున్నాయా అనే అనుమానాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


