పదిలో పెరిగిన ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

పదిలో పెరిగిన ఉత్తీర్ణత

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

● ర్యాంకు మాత్రం 21నుంచి 25కు.. ● పలు ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత ● ఏటా మాదిరిగానే బాలికలదే పైచేయి! ఉత్తీర్ణత పైకి.. ర్యాంకు దిగువకు...

ఈ ఏడాది ఉత్తీర్ణత వివరాలు

ఖమ్మం సహకారనగర్‌: పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు నమోదు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు పలువురు అత్యుత్తమ మార్కులు సాధించారు. గతేడాది నుంచి మార్కుల విధానం అమలవుతుండగా, అత్యధికంగా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈమేరకు బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 95.12శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడైంది. ఇక ఎప్పటిలాగే బాలుర కంటే బాలికలు ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. ఇదికాక జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ గురుకులాల్లో ఈసారి వంద శాతం ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం.

పదో తరగతి ఽఫలితాలు గతేడాది జిల్లాలో 94.47శాతంగా నమోదయ్యాయి. దీంతో జిల్లా రాష్ట్రస్థాయిలో 21వ స్థానాన నిలిచింది. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగి 95.12 శాతంగా నమోదైంది. అయినప్పటికీ ర్యాంకు మాత్రం 25వ స్థానానికి పడిపోవడం గమనార్హం.

కేటగిరీ హాజరైన వారు ఉత్తీర్ణులు శాతం

బాలురు 8,737 8,201 93.87

బాలికలు 8,221 7,930 96.46

మొత్తం 16,958 16,131 95.12

Advertisement
 
Advertisement
Advertisement