ఖమ్మంవ్యవసాయం: జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ బదిలీ అయ్యారు. ఆయనను నిజామాబాద్ జిల్లా డీఎఫ్‌ఓగా బదిలీ చేయగా, ఆ స్థానంలో వరంగల్ డీఎఫ్‌ఓ గా ఉన్న అనూజ్ అగర్వాల్‌ను నియమించారు. రాష్ట్రంలో 12మంది డీఎఫ్‌ఓలను బదిలీ చేస్తూ రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సి.సువర్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా సిద్ధార్థ్‌ను నిజామాబాద్‌కు బదిలీ చేసి ఆ స్థానంలో అగర్వాల్‌ను నియ మించారు. కాగా, సిద్ధార్థ్ డీఎఫ్‌ఓగా మూడేళ్ల పది నెలల పాటు పని చేశారు. పులిగుండాల ఎకో–టూరిజం ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు.
నిజామాబాద్‌కు సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ బదిలీ


