జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్‌

Apr 29 2026 8:12 AM | Updated on Apr 29 2026 8:12 AM

ఖమ్మంలీగల్‌: సమాజంలో ప్రతిఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని, తద్వారా ఆపదలో ఉన్న వారికి సాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ తెలిపారు. వేసవి దృష్ట్యా రామసహాయం కల్ప నారెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన కోర్టుకు వచ్చే కక్షిదారులకు పెరుగన్నం పంపిణీని మంగళవారం జిల్లా జడ్జి ప్రారంభించి మాట్లాడారు. జూన్‌ 1వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలి పారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యడ్లపల్లి రమేష్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఖమ్మం సహకారనగర్‌: కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన దివాకర టీఎస్‌ మంగవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్క అందజేశారు. అనంతరం జిల్లాకు సంబంధించి పలు అంశాలపై ఇద్దరు చర్చించుకున్నారు.

సేవాభావం కలిగి ఉండాలి

రైతులు పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవాలి

ఏన్కూరు: రైతులు ఎరువుల వాడకం.. తద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన సాగవుతున్న పంటలను పరిశీలించాక రాంనగర్‌ తండాలో రైతులతో సమవేశమయ్యారు. పంటలపై విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు వాడొద్దని తెలిపారు. అంతేకాక పంటల అనంతరం అవశేషాలను కాల్చివేయకుండా కలియదున్నితే మంచి ఫలి తాలు వస్తాయన్నారు. ఆతర్వాత ఏన్కూరు రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని వచ్చే వచ్చే వానాకాలం సాగు చేయాల్సిన పంటలపై అవగాహన కల్పించారు. విత్తనాలను డీలర్ల వద్దే కొనుగోలు చేయాలని తెలిపారు. ఏఓ నరసింహారావు, ఏఈఓలు పాల్గొన్నారు.

ఖైదీలకు న్యాయసాయం

ఖమ్మంలీగల్‌: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఖైదీల హక్కులు, వేగవంతమైన విచారణ, అవసరమైన చోట బెయిల్‌ పొందే అవకాశాలపై అవగాహన కల్పించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దేవీమానస తెలిపారు. జిల్లా జైలును మంగళవారం సందర్శించిన ఆమె మాట్లాడారు. ఖైదీలు అనవసరంగా దీర్ఘకాలం జైలులో ఉండకుండా సమయానికి న్యాయసాయం అందిస్తామని తెలిపారు. ఇందుకోసం తరచుగా న్యాయ సహాయ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం జైలులోని వసతులను పరిశీలించడమే కాక విచారణ ఖైదీలతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. అధికారులు, న్యాయవాదులు శ్రీధర్‌, ఖండే వెంకటేశ్వరరావు, తొర్రికొండ శ్రీను పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఖమ్మంగాంధీచౌక్‌: ఖమ్మంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం(గుట్ట)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, కల్యాణ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. వచ్చేనెల 2వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు విశ్వక్సేన పూజ, అంకురార్పణ పూజలతో పాటు గరుడ ధ్వజారోహణ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌ కుమార్‌, ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ కలెక్టర్‌ దివాకర టీఎస్‌, సీపీ సునీల్‌దత్‌ను ఆలయ బాధ్యులు మంగళవారం ఆహ్వానించారు.

Advertisement
 
Advertisement
Advertisement