యువతకు విస్తృత ఉపాధి అవకాశాలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

యువతకు విస్తృత ఉపాధి అవకాశాలే లక్ష్యం

Apr 29 2026 8:12 AM | Updated on Apr 29 2026 8:12 AM

● కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌ ● 3,200 ఉద్యోగాల భర్తీకి మే 4న మెగా జాబ్‌ మేళా

● కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌ ● 3,200 ఉద్యోగాల భర్తీకి మే 4న మెగా జాబ్‌ మేళా

ఖమ్మం రాపర్తినగర్‌: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని ఖమ్మం కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడారు. సుమారు 80కంపెనీలను ఆహ్వానించి 3,200 పోస్టుల భర్తీ కోసం వచ్చేనెల 4న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈమేళాకు సుమారు 10వేల మంది నిరుద్యోగులు హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన వేదికను గుర్తించాలని సూచించారు. అంతేకాక యువతను అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. అలాగే, వేసవి దృష్ట్యా వైద్యశిబిరం, పార్కింగ్‌ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. అంతేకాక దరఖాస్తు చేసుకోవడం, కంపెనీల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు క్యూఆర్‌ కోడ్లు రూపొందించాలని కలెక్టర్‌తెలిపారు. అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు ప్రవీణ్‌కుమార్‌, ఎన్‌.మాధవి, ఈ.నకుల్‌రెడ్డి, డాక్టర్‌ వేణుమాధవ్‌, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరా మహిళా డెయిరీపై ప్రత్యేక దృష్టి

ఖమ్మం మయూరిసెంటర్‌: ఇందిరా మహిళా డెయిరీని విజయవంతం చేసేలా విజయ డెయిరీ నమూనాను అనుసరిస్తూ సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని మంగళవారం ఆయన అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి. శ్రీజతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇందిరా మహిళా డెయిరీ అమలులో వ్యవస్థీకృత విధానం అమలుచేయాలని, ఇందులో విజయ డెయిరీ ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. డెయిరీ ద్వారా దశల వారీగా 40వేల మంది లబ్ధిదారులకు పశువులు పంపిణీ చేసి, రోజుకు 80 వేల లీటర్ల పాలు సేకరించే లక్ష్యం ఖరారు చేసినట్లు చెప్పారు.

బీఎంసీ పరిశీలన

ముదిగొండ: ముదిగొండలోని ఇందిరా మహిళా డెయిరీ బల్క్‌ మిల్స్‌ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్‌ దివాకర పరిశీలించారు. ఇప్పటివరకు బల్క్‌ మిల్క్‌ సెంటర్‌ వినియోగంలోకి రాకపోవడంపై కారణాలను ఆరా తీశారు. మండలంలో మహిళలకు 24 గేదెలు పంపిణీ చేసినా అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్‌, ఉద్యోగులు సత్యనారాయణ, భాస్కర్‌రావు, అశోక్‌, సర్పంచ్‌ కట్టకూరి ఉపేందర్‌తో పాటు మెట్టెల సతీష్‌, రామకృష్ట పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement