ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన లారీ | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన లారీ

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

తిరుమలాయపాలెం: ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఏపీ నుంచి బొప్పాయి లోడుతో వరంగల్‌ వెళ్తున్న లారీలో తిరుమలాయపాలెం మండలం గోపాయిగూడెం స్టేజీ వద్ద డీజిల్‌ అయిపోవడంతో పక్కన ఆపారు. ఈక్రమాన వెనక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టడంతో రెండో లారీలోని ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. కాగా, బొప్పాయి లోడ్‌ లారీలోని కాయలు చెల్లాచెదురుగా పడడంతో ఆ మార్గంలో వెళ్తున్న వారు తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. ఈమేరకు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడగా పోలీసులు చేరుకుని సరిదిద్దారు. కాగా, క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదని ఎస్‌ఐ జగదీష్‌ తెలిపారు.

బొప్పాయికాయలు తీసుకునేందుకు

ఎగబడిన జనం

Advertisement
 
Advertisement
Advertisement