తిరుమలాయపాలెం: పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుపై కట్టిన వైరు తాకడంతో ఓ యువకుడి మెడకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బచ్చోడుకు చెందిన నందిపాటి ఉపేందర్ ఆదివారం రాత్రి దమ్మాయిగూడెం నుండి మోటార్‌సైకిల్‌పై బచ్చోడు వైపు వెళ్తున్నాడు. బీరోలు సమీపాన బంక్ వద్ద వాహనాలు రాకుండా నిర్వాహకులు రోడ్డుకు అడ్డంగా వైర్ కట్టారు. చీకట్లో వైర్ కనిపించక ఉపేందర్ ముందుకు వెళ్లడంతో ఆయన మెడకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా, బంక్ యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


