రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

వైరా: వైరాలో ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. వైరా మండలం ముసలిమడుగుకు చెందిన వేల్పుల చందు(18), వినోద్‌ సోమవారం ద్విచక్రవాహనంపై ఖమ్మం వెళ్తున్నారు. వీరి వాహనాన్ని హనుమాన్‌ బజార్‌ వద్ద ఎదురుగా బైక్‌పై వచ్చిన శ్రీనివాస్‌ ఢీకొట్టాడు. ఘటనలో చందుకు తీవ్ర గాయాలు కాగా 108లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు.

చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు

కారేపల్లి: తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడి, తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని కారేపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ బి.గోపి తెలిపిన వివరాలు... ఖమ్మం ఖిల్లా బజార్‌కు చెందిన ఎండీ.మతిన్‌ కారేపల్లి పరిధిలో మూడు, మధిర, బోనకల్‌, పెద్దపల్లి మండలాల్లో ఒక్కో చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈమేరకు విచారణ చేపట్టిన కారేపల్లి పోలీసులు ఆయనను కారేపల్లి ఆటోస్టాండ్‌ వద్ద సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మతిన్‌ నుంచి మూడు తులాల బంగారం, 20తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement