కల్లూరు రూరల్: ఎవరికీ అనుమానం రాకుండా వరిగడ్డిలో దాచిన 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఉద్యోగులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం – పెనుబల్లి మండలంలోని కుప్పినకుంట్ల మధ్య వాగు పక్కన బియ్యం నిల్వలు ఉన్నాయనే సమాచారంతో జీపీఓ నాగరాజు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. దీంతో గడ్డిలో దాచిన బస్తాలు లభించగా ట్రాక్టర్‌లో కల్లూరులోని గోదాంకు తరలించారు. రెండు రోజుల క్రితమే కల్లూరు మండలంలోని మూడు షాపుల్లో రికార్డులకు మించి బియ్యం ఉండడంతో అధికారులు షాప్‌లను సీజ్ చేశారు. అలాగే, ముగ్గు వెంకటాపురం నుంచి రెండు రోజుల క్రితమే 6.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఏపీకి తరలిస్తుండగా పట్టుకున్నారు. మళ్లీ సోమవారం గ్రామ శివార్లలో 50 క్వింటాళ్ల బియ్యం పట్టుబడడంతో ఈ గ్రామం కేంద్రంగా దందా సాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాగు పక్కన గడ్డిలో నిల్వలు


