ముదిగొండ: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు సౌకర్యాలు కల్పించడంతో పాటు పథకాల అమలులో వెనకాడేది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండలం మేడేపల్లిలో రూ 9కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్ల నిర్మాణాలకు డిప్యూటీ సీఎం ఆదివారం రాత్రి శంకుస్ణాపన చేశారు. తొలుత గ్రామ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఆలయంలో పూజలు చేసిన భట్టి.. మేడేపల్లి–గోకినేపల్లి, మేడేపల్లి–యడవల్లి లక్ష్మీపురం వరకు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని.. ఎక్కడ ఏ వసతులు కల్పించాలన్నా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుత్ను పలువురిని ఆయన పరామర్శించగా, ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు చేయాలని, గన్నీ సంచులు సమకూర్చాలని రైతులు కోరారు. ఈ మేరకు మార్క్‌ఫెడ్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి సూచనలు చేశారు. గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, నాయకులు, ప్రజాప్రతినిధులు కొండబాల కోటేశ్వరరావు, సామి నేని వెంకటేశ్వరరావు, సామినేని రమేష్, చెరుకుపల్లి జగన్నాధం, శ్రీనివాసరావు, జూలకంటి సంజీవరెడ్డి, పసుపులేటి దేవేంద్రం, దేవరపల్లి ఆదినారాయణ రెడ్డి, బాబురాంరెడ్డి, రాఘవ పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


