రోడ్డెక్కిన బస్సులు.. | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన బస్సులు..

Apr 26 2026 2:39 AM | Updated on Apr 26 2026 2:39 AM

● సమ్మె విరమణతో విధుల్లోకి కార్మికులు ● రీజియన్‌లో వంద శాతం బస్సులు నడిపించిన అధికారులు

● సమ్మె విరమణతో విధుల్లోకి కార్మికులు ● రీజియన్‌లో వంద శాతం బస్సులు నడిపించిన అధికారులు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్ల పరిష్కారంపై సానుకూలంగా స్పందన రావడంతో శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించా రు. ఈమేరకు శనివారం మొదటి షిఫ్ట్‌ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ యథావిధిగా నడిచాయి. సమస్యల పరి ష్కారానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రీజియన్‌లోని అన్ని డిపోలకు తెల్లవారుజామున 4–30 గంటల నుండే కార్మికులు విధులకు హాజరయ్యారు.

అన్ని రూట్లకు ప్రారంభం

సమ్మె కారణంగా ఈనెల 22 నుండి 24వ తేదీ వరకు హైదరాబాద్‌, నల్లగొండ, విజయవాడ, రాజమండ్రి, బెంగుళూరు వంటి దూర ప్రాంతాలకు బస్సులను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈమేరకు శనివారం అన్ని రూట్లతో పాటు ఉదయం 5 గంటల నుంచే హైదరాబాద్‌కు బస్సులను ప్రారంభించారు. రీజియన్‌లో 538 బస్సులకు గాను అన్నీ దశల వారీగా సాయంత్రం వరకు రోడ్డెక్కాయి. ఆర్టీసీ, అద్దె బస్సులు బస్టాండ్లకు చేరడం, ప్రయాణికులు రావడంతో బస్టాండ్లు కళకళలాడాయి.

Advertisement
 
Advertisement
Advertisement