భార్యను కత్తితో పొడిచిన భర్త.. | - | Sakshi
Sakshi News home page

భార్యను కత్తితో పొడిచిన భర్త..

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

చండ్రుగొండ: వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో భర్త కట్టుకున్న భార్యనే కత్తితో పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతిచెందింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అయన్నపాలెం గ్రామానికి చెందిన బొప్పి నాగరాజు తన భార్య బొప్పి పున్నేశ్వరి (42)ని.. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ నెల 21వ తేదీన కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత కొత్తగూడెం ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి సోదరి చాపలమడుగు చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..

Advertisement
 
Advertisement
Advertisement