భద్రాచలం: సమ్మర్ క్యాంపుల్లో విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. శనివారం భద్రాచలంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల గిరిజన విద్యార్థులకు చేపట్టిన సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఓ రాహుల్ మాట్లాడుతూ మే నెల 9వ తేదీ వరకు క్యాంపు కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు సబ్జెక్ట్‌లతోపాటు యోగా, డ్యాన్స్, వివిధ క్రీడలు, బొమ్మల పెయింటింగ్, కుట్లు, అల్లికలు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, వ్యాసరచన పోటీలు తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్ మాట్లాడుతూ ఐటీడీఏవ్యాప్తంగా 200 మందిని బాలబాలికలను ఎంపిక చేశామని, బాలికలకు బాలికల గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో, బాలురకు వికాసం పాఠశాలలో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేశారు. అధికారులు రమేష్, అలివేలు మంగతాయారు, సుభద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పీఓ రాహుల్


