తెలంగాణను కాపాడుకునే బాధ్యత అందరిది.. | - | Sakshi
Sakshi News home page

తెలంగాణను కాపాడుకునే బాధ్యత అందరిది..

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

ఖమ్మంమామిళ్లగూడెం: అన్ని వర్గాల వారు పోరాడి తెలంగాణను సాధించుకోగా, గత సీఎం కేసీఆర్‌ పాలన కారణంగా ఆగమైనందున కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం మామిళ్లగూడెంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి తాను చురుకై న పాత్ర పోషించానని తెలిపారు. అయితే, తెలంగాణ ఏర్పడ్డాక దళితులకు సీఎం పదవిపై మాట తప్పిన కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా కుటుంబ పాలన కొనసాగించారని విమర్శించారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి అయినా ప్రజాభీష్టం మేరకు పాలన కొనసాగించాలని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీరప్ప, రాష్ట్ర, జిల్లాల నాయకులు కె.గిరీశ్‌, రాజ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్‌ విక్రమ్‌శర్మ, డాక్టర్‌ సోమగాని నరేందర్‌, జానీ మహమ్మద్‌, ఎం.వెంకటేశ్వరాచారి, ఎన్‌.భాస్కరరావు, సుధాకర్‌యాదవ్‌, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు దిలీప్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement