ఖమ్మంవైరారోడ్: అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ చికిత్స చేయించుకున్న వారికి తన సిఫారసుతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పంపిణీ చేశారు. ఖమ్మం బుర్హాన్‌పురంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవా రం ఆయన 19మందికి రూ.8.50 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో పాటు ఇద్దరికి రూ.4 లక్షల విలువైన ఎల్‌ఓసీ పత్రాలను అందజేసి మాట్లాడారు.
పలువురి కుటుంబాలకు పరామర్శ
ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం పరామర్శించారు. ధంసలాపురంలోని అగ్రహారంలో ఆళ్లవెంకటరెడ్డి, శ్రీరామ్‌హిల్స్‌లో కమర్తపు బతు కమ్మ, మధిరలో ఆది వెంకటేశ్వర్లు (పెద్దబ్బాయ్) చిత్రపటాల వద్ద ఎంపీ నివాళులర్పించారు. వీరి కుటుంబీకులు శేషవర్ధన్‌రెడ్డి, అంజిరెడ్డి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, సత్యవర్ధన్‌రెడ్డి, కమర్తపు మురళి, రవీందర్, కూరపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ కూరపాటి ప్రదీప్‌ను పరామర్శించారు. ఈకార్యక్రమాల్లో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మధిర మార్కెట్ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, నాయకులు, ప్రజాప్రతినిధులు వెన్నంశెట్టి అప్పారావు, అరిగే శ్రీనివాసరావు, యాసా రామారావు, ఎల్.గోపాల్‌రావు, సాగర్, గుణచరిత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


