సమస్యలకు తక్షణ పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు తక్షణ పరిష్కారం

Apr 25 2026 7:54 AM | Updated on Apr 25 2026 7:54 AM

● నేడు రాయగూడెం, సుబ్లేడులో ప్రజాదర్బార్‌ ● పాల్గొననున్న మంత్రి పొంగులేటి, హాజరుకానున్న అధికారులు

● నేడు రాయగూడెం, సుబ్లేడులో ప్రజాదర్బార్‌ ● పాల్గొననున్న మంత్రి పొంగులేటి, హాజరుకానున్న అధికారులు

నేలకొండపల్లి/తిరుమలాయపాలెం: ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపించడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో శనివారం ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం రాయగూడెం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో జరగనున్న ప్రజాదర్బార్‌ సమావేశాల్లో మంత్రి పొంగులేటి స్వయంగా పాల్గొంటారు. అంతేకాక అన్ని శాఖల అధికారుల హాజరుకానుండగా, ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించనున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

రాయగూడెం, సుబ్లేడులో ప్రజాదర్బార్‌ ఏర్పాట్లను అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి గురువారం పరిశీ లించారు. రాయగూడెం క్లస్టర్‌లో అజయ్‌తండా, రాయగూడెం, చెరువుమాధారం, మంగాపురంతండా, అప్పలనరసింహాపురం, బుద్ధారం, కట్టుకాచా రం, కొంగర, రాజారాంపేట, బైరవునిపల్లి పంచా యతీల ప్రజలు పాల్గొని తమ సమస్యలు విన్నవించనున్నందున ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెవెన్యూ, భూ సమస్యలు, ఇంది రమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులతో పాటు మౌలిక వసతులపై వినతిపత్రాలు ఇస్తే పూర్తి సమాచారంతో సమాధానాలు చెప్పేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆతర్వాత అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. రాయగూడెంలో ఉదయం 8గంటలకు, సుబ్లేడులో మధ్యాహ్నం 3–30గంటలకు ప్రజాదర్బార్‌ ఉంటుందని తెలిపా రు. జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరెడ్డి, డీఎల్‌పీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొనగా.. ఆతర్వాత సర్పంచ్‌లతోనూ సమావేశమై సూచనలు చేశారు. ఈ సమావేశాల్లో తహసీల్దార్‌ పి.రాంప్రసాద్‌, లూథర్‌ విల్సన్‌, ఎంపీడీఓలు ఎం.యర్రయ్య, సిలార్‌సాహెబ్‌, ఎంపీఓ శివ, వివిధ శాఖల అధికారులు, నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, రెండు చోట్ల ప్రజాదర్బార్‌లో పాల్గొనే వారికోసం వేయిమందికి చొప్పున భోజన ఏర్పాట్లు చేస్తుండగా, వేసవి నేపథ్యాన తాగునీరు, మజ్జిగ సమకూర్చనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement