ఖమ్మంవైరారోడ్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక బదనాం చేసేందుకు కాళేశ్వరంపై ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తే.. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరాన్ని కేవలం మూడేళ్లలో పూర్తి చేసి తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చారని తెలిపారు. అయితే, మేడిగడ్డలోని రెండు పిల్లర్లు కుంగిపోతే, మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రస్తుత ప్రభుత్వం ప్రచారం చేసి, కమిషన్లు ఏర్పాటు చేసి, కేసీఆర్, హరీశ్‌రావును ఇబ్బంది పెట్టాలని యత్నించినా ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, తాజుద్దీన్, నాయకులు ముత్యాల వెంకటప్పారావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, ఈదుల రాజేశ్, బెల్లంకొండ గోపి, మహమ్మద్ రఫీ, కృష్ణ ప్రసాద్, పోలిపాంగు వెంకట్, ఉప్పల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు,
ఎమ్మెల్సీ తాతా మధు


