ఏన్కూరు: ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం బాయ్స్ హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు తెలిపారు. నారాయణ, బసవమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ శెట్టిపల్లి నాగేశ్వరరావును గురువారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల వివరాలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు. విద్యార్థుల కోసం ఏర్పాటుచేయనున్న హాస్టల్ వచ్చే విద్యాసంవత్సరం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.సింహాచలం, అధ్యాపకులు కిషోర్, శివ, నవీన్, లావణ్య పాల్గొన్నారు.


