సత్తుపల్లి: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. సత్తుపల్లి డిపో గేటు ఎదుట కార్మికుల ధర్నాకు గురువారం ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కార్మికులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చించి సమ్మె విరమణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేశ్, నాయకులు మల్లూరు అంకమరాజు, ఎస్‌కే చాంద్‌పాషా, రఫీ, వల్లభవనేని పవన్, విజయ్, ప్రకాశరావు, చంటి, రఘు, అద్దంకి అనిల్, కృష్ణ పాల్గొన్నారు.
●కల్లూరురూరల్/వేంసూరు: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యాన రైతులు కల్లూరులో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. అయితే, ప్రభుత్వ తీరుతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకుని నష్టపోతున్నారని తెలిపారు. జిల్లాలో 308 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా కనీసం ఐదు కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు మొదలుకాలేదని చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్లలోనూ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. మాజీ జెడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్, నాయకులు డాక్టర్ లక్కినేని రఘు, పెద్దబోయిన మల్లేశ్వరరావు, బోబోలు లక్ష్మణ్‌రావు, సూర్యనారాయణ, సయ్యద్ రపూఫ్, మేకల కృష్ణ, కాటంనేని వెంకటేశ్వరరావు, రవి, పేడకంటి రామకృష్ణ, ఎండీ ఇస్మాయిల్, రాజ్‌కుమార్, ఇంతియాజ్ పాల్గొన్నారు. కాగా, బీఆర్‌ఎస్ వేంసూరు మండల కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు సతీమణి జానకమ్మ ఇటీవల మృతి చెందగా సండ్ర వెంకటవీరయ్య నివాళులర్పించారు. నాయకులు పాలా వెంకటరెడ్డి, పగుట్ల వెంకటేశ్వరరావు, యర్రా రమేశ్, వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య


