గోదాం నిర్మాణంతో రైతులకు మేలు | - | Sakshi
Sakshi News home page

గోదాం నిర్మాణంతో రైతులకు మేలు

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 7:20 AM

కల్లూరురూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో గోదాములు నిర్మిస్తే రైతులు పండించిన పంట నిల్వలకు దోహదపడుతాయని అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లిలో గోదాం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని గురువారం ఆయన కల్లూరు సబ్‌కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశం కాగా వారు పలు సమస్యలను విన్నవించారు. ఆ తర్వాత ఎన్నెస్సీ ప్రాంతంలోని డంపింగ్‌ యార్డ్‌ ప్రతిపాదిత స్థలం, చెన్నూరులో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు రోడ్డు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. సర్పంచ్‌ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ బ్రహ్మేశ్వరరావు, గిర్దావర్‌ సుజాత పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని వినతి

ఖమ్మంసహకారనగర్‌: పలు శాఖల్లో రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకొని తిరిగి రెవెన్యూ శాఖలో జీపీఓలుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేయడమే కాక ఇతర సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామపాలన అధికారుల సంఘం (టీజీపీఓ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నె గురుమూర్తి, చీమటి వీరబాబు కోరారు. గురువారం అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పెండింగ్‌ ఇంక్రిమెంట్లు విడుదల చేయడమే కాక డిపార్ట్‌మెంటల్‌ టెస్టు పాసైన వారికి సర్వే శిక్షణ ఇప్పించాలని కోరారు. నాయకులు నెల్లూరి లవన్‌కుమార్‌, అన్వర్‌, రవికుమార్‌, వీరన్న, వీరభద్రం, కోటయ్య, అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన

అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement