లక్కు ఎవరికి దక్కేనో ?
ఖమ్మంక్రైం : నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 ఏ4 (మద్యం) షాపులకు సోమవారం నగరంలోని సీక్వెల్ ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో లాటరీ తీయనున్నారు.ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ అధికారి నాగేందర్‌రెడ్డి, సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా దుకాణాలు దక్కించుకునేందుకు టెండర్లు వేసిన వ్యాపారులు తమకే షాపు దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. గ్రూప్‌లుగా ఏర్పడి 20 నుంచి 30 షాపులకు దరఖాస్తులు వేసిన వారు కనీసం తమకు రెండు నుంచి ఐదు షాపుల వరకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా 116 షాపులకు గాను 4,430 దరఖాస్తులు రాగా, ఎకై ్సజ్ శాఖకు రూ.133 కోట్ల మేర ఆదాయం లభించిన విషయం విదితమే.
జిల్లాకు చేరిన ఆంధ్రా వ్యాపారులు..
మద్యం దుకాణాలకు టెండర్లు వేసిన ఆంధ్రా వ్యాపారులు ఆదివారమే ఖమ్మం చేరుకుని పలు లాడ్జీల్లో గదులు తీసుకుని ఉన్నారు. గిరాకీ ఎక్కువగా ఉండే షాపులు తమకు రాకపోతే వాటిని ఎలాగైనా దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం పలువురు వ్యాపారులు రూ.కోట్లు వెచ్చించేందుకై నా సిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఈసారి విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల నుంచి సైతం మద్యం వ్యాపారులు ఖమ్మంలో దరఖాస్తులు చేయడం గమనార్హం.
అందరి చూపూ.. ఆ షాపుపైనే
ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1 పరిధిలో షాపు నంబర్ 27 (చింతకాని)కు 75 దరఖాస్తులు రావడంతో అందరి చూపూ అటువైపే ఉంది. అదే స్టేషన్ పరిధిలోని షాపు నంబర్ 23కు 72 దరఖాస్తులు, షాపు నంబర్ 26కు 71 దరఖాస్తులు వచ్చాయి. మరి అధిక అమ్మకాలు ఉండే ఈ షాపులు ఎవరికి దక్కుతాయో చూడాలి. మద్యం షాపుల డ్రాలో పాల్గొనే వారు సోమవారం ఉదయం 9 గంటల వరకు సీక్వెల్ రిసార్ట్స్‌కు చేరుకోవాలని జిల్లా ఎకై ్సజ్ అధికారి నాగేందర్ రెడ్డి కోరారు. ఎంట్రీ పాస్ ఉన్నవారినే అనుమతిస్తామని, డ్రాలో పాల్గొనే వారు మొబైల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు.
మద్యం షాపులకు నేడు డ్రా


