●పాఠశాలలు ముస్తాబు
ఈ విద్యా సంవత్సరం పాఠశాలల్లో పూర్తిస్థాయి వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని 955 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా మరమ్మతు పనులు చేపట్టగా, ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. ఒకటీ, అర మినహా అదనపు తరగతి గదులు, ప్రహరీలు, టాయిలెట్ల నిర్మాణం పూర్తయింది. ఇక చాలా పాఠశాలల్లో విద్యుత్ సమస్య ఉండడంతో వైరింగ్ చేయించడమే కాక అవసరమైన చోట్ల భవనాలకు రంగులు వేయించారు. ఇక ప్రారంభం రోజున విద్యార్థులకు స్వాగతం పలికేలా పాఠశాలలను పూలు, తోరణాలతో అలంకరించనున్నారు.
ఖమ్మం రోటరీనగర్‌లోని
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల


