విందుల్లో విష సంస్కృతి | - | Sakshi
Sakshi News home page

విందుల్లో విష సంస్కృతి

Jun 3 2025 12:28 AM | Updated on Jun 3 2025 12:28 AM

విందు

విందుల్లో విష సంస్కృతి

● విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ ప్లేట్ల వినియోగం ● పుట్టగొడుగుల్లా పరిశ్రమల ఏర్పాటు, విక్రయం ● ఆహారపదార్థాల కలుషితం.. పరిశ్రమల పరిసరాల్లో ఇక్కట్లు

అధికారులు స్పందించాలి

ప్లాస్టిక్‌ వినియోగం ఏదో ఒక రూపంలో ప్రజలను వెంటాడుతేనే పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం రావడం లేదు. అధికారులు ప్లాస్టిక్‌ నిషేధంపై మరింత చిత్తశుద్ధి పనిచేయాలి.

– మహేష్‌రెడ్డి, భద్రాచలం

ప్లాస్టిక్‌ నిర్మూలనపై దృష్టి

భద్రాచలంలో ప్లాస్టిక్‌ నిషేధం అమలుకు కృషి చేస్తున్నాం. తొలుత షాపుల్లో కవర్ల వినియోగాన్ని నిర్మూలించే కార్యక్రమం చేపట్టాం. త్వరలో ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పుల తయారీ పరిశ్రమలపైనా దృష్టి సారిస్తాం. వాటర్‌ ప్లాంట్ల వద్ద కూడా పరిశీలిస్తాం. – శ్రీనివాసరావు,

గ్రామపంచాయతీ ఈఓ, భద్రాచలం

భద్రాచలంఅర్బన్‌: పట్టణాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న ఏ విందు అయినా భోజనం వడ్డించడం ఆనవాయితీ. గతంలో అరటి ఆకులు, అడ్డాకులు(విస్తర్లు) వినియోగించగా.. ఇప్పుడు ప్లాస్టిక్‌ బఫే పేట్లు తెరపైకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం భద్రాచలంలోనే వీటి తయారీకి 6 – 7 కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్లేట్లలో భోజనాలు చేసే వ్యక్తులు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఆయా కార్యక్రమాల వద్ద తాగునీరు సమకూర్చేందుకు వినియోగిస్తున్న వాటర్‌ ప్యాకెట్లు కూడా అంతే ప్రమాదంగా మారుతున్నాయి.

అంతా కలుషితమే...

ఇప్పుడు ప్రతీ గల్లీలో పేపర్‌ ప్లేట్ల పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే, వీటి తయారీకి ఉపయోగించే ముడిసరుకు ప్రమాదకరమని.. తయారీ అనంతరం మిగిలిన వ్యర్థాలను పొలాలు, చెరువుల పక్కన వేయడంతో ఆ ప్రాంతాలు కలుషితమవుతున్నాయని చెబుతున్నారు. అంతేకాక ఉపయోగం అనంతరం రహదారుల వెంట వేస్తుండడంతో అందులోని ఆహార పదార్థాలనే కాక ప్లేట్లను తింటున్న పశువులు సైతం రోగాల బారిన పడుతున్నాయి.

ప్రమాదకర రసాయనాలు..

పేపర్‌ ప్లేట్లు, కప్పుల్లో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని చెబుతున్నారు. హైడ్రోఫోబిక్‌ ఫిల్మ్‌ పొరను వినియోగిస్తుండగా.. మోట్రో సోమిన్‌,బిస్పినాల్‌, బార్డ్‌ ఇథనాల్‌ డాక్సిన్‌ వంటి కెమికల్స్‌ ఈ ప్లేట్లు, కప్పుల్లో ఉంటాయని తెలుస్తోంది. ఇందులో వేడి వేడి ఆహార పదార్థాలు వేశాక కరిగి ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరంలోకి చేరుతాయని.. తద్వారా చర్మసంబంధిత వ్యాధులే ఇతర ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశముందని చెబుతున్నారు.

విందుల్లో విష సంస్కృతి1
1/3

విందుల్లో విష సంస్కృతి

విందుల్లో విష సంస్కృతి2
2/3

విందుల్లో విష సంస్కృతి

విందుల్లో విష సంస్కృతి3
3/3

విందుల్లో విష సంస్కృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement