
ఫంక్షన్ హాళ్ల మధ్య దుర్గంధం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద ఫంక్షన్‌హాళ్ల సమీపంలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేక దుర్గంధం వెదజల్లుతోంది. ఫంక్షన్ హాళ్ల యజమానులు డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో మురుగునీరు హాళ్ల మధ్య గల ఖాళీ ప్రదేశంలోకి చేరుతోంది. దీంతో ఫంక్షన్లు చేసుకునే వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ కార్యదర్శికి, ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడు లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్రెయినేజీ వ్యవస్థ లేక అవస్థలు