
శ్రీచైతన్య ప్రభంజనం
సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రభంజనం సృష్టించారని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఖమ్మం మమత రోడ్డులోని శ్రీచైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించగా వారిని అభినందించి మాట్లాడారు. కాసిన జస్వంత్ 500 మార్కులకు 489 మార్కులు, కవితాచౌదరి 485, యశస్విత 484, సూర్యతేజ 483, సంహితరెడ్డి 480 మార్కులు సాధించగా, వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏజీఎం చేతన్‌మాధూర్, కోఆర్డినేటర్ కృష్ణారావు, ప్రిన్సిపాళ్లు నాగప్రవీణ, టీ.ఎల్.ఎన్.శర్మ, సురేష్, డీన్ లక్ష్మీ నర్సింహ, ఇన్‌చార్జ్‌లు రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు.