
విద్యార్థులకు మెరుగైన బోధనే లక్ష్యం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన చేసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఉపాధ్యాయులకు మూడు విడతలుగా ఇవ్వనున్న శిక్షణ మంగళవారం ఖమ్మంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నందున వారిని ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఉపాధ్యాయులు విజయలక్ష్మి తీసుకున్న శ్రద్ధతో ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. అలాగే, భవిత సెంటర్లలో అవసరమైన పరికరాలు సమకూరుస్తూ, దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డీఈఓ ఎస్.సత్యనారాయణ, సీఎంఓ రాజశేఖర్, ఏఎంఓ రవికుమార్, ఎంఐఎస్ రామకృష్ణ, హార్వెస్ట్ కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి పాల్గొన్నారు.
జూలై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు
ఇందిరా మహిళా డెయిరీ పథకం ద్వారా జూలై 15 తర్వాత లబ్ధిదారులకు పాడి పశువులు కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. డెయిరీ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ జూలై 15నుంచి జనవరి వరకు 5వేల పాడి పశువుల యూనిట్లు గ్రౌండింగ్ చేయాలన్నారు. ఈ క్రమంలో పశువుల ఆరోగ్యం, ఇతర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. డీఆర్డీఓ సన్యాసయ్య, బీసీ, ఎస్సీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు జి.జ్యోతి, నవీన్‌బాబు, డాక్టర్ పురంధర్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
మహిళా మార్ట్ నిర్వహణపై శిక్షణ
● ఖమ్మంమయూరిసెంటర్: మహిళా మార్ట్‌ను లాభాల బాటలో నడిపేలా మహిళా సంఘాల సభ్యులకు ఇప్పటికే శిక్షణ ఇప్పించామని కలెక్టర్ ముజమ్మిల్ తెలిపారు. ఖమ్మం సీక్వెల్ రోడ్డులో సిద్ధమవుతున్న మార్ట్‌ను పరిశీలించిన ఆయన మాట్లాడారు. సామగ్రి నిర్వహణ, భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీఆర్‌డీఓ ఆర్.సన్యాసయ్య, పీఆర్ ఈఈ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి
ఉపాధ్యాయుల శిక్షణలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్