రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన | - | Sakshi
Sakshi News home page

రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

May 13 2025 12:20 AM | Updated on May 13 2025 12:20 AM

రేపు

రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం పర్యటించనున్నారు. మండల కేంద్రంలో రూ.22 కోట్లతో నిర్మించే 50 పడకల ఆస్పత్రి భవనం, రూ.2.62కోట్లతో కండ్రిక – పెద్ద గోపవరం బీటీ రోడ్డు పనులు, రూ.5.74 కోట్లతో నిర్మించే బనిగండ్లపాడు – బంజర బీటీ రోడ్డు నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.

పంటల సాగులో

మెళకువలపై అవగాహన

వైరారూరల్‌: ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగామండలంలోని ఖానాపురం రైతు వేదికలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈసందర్బంగా వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.రవికుమార్‌ మాట్లాడుతు యూరియా వాడకం తగ్గింపు, తద్వారానేల ఆరోగ్య పరిరక్షణపై వివరించారు. అనంతరం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్‌ వి.చైతన్య, వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ వివిధ అంశాలపై మాట్లాడారు.ఏఓ మయాన్‌ మంజుఖాన్‌, తల్లాడ వెటర్నరీ వైద్యులు అనాస్‌, విత్తన అభివృద్ధి అధికారి అక్షిత, ఏఈఓలు సపావత్‌ సైదులు, ఆలూరి వాసంతి, వెంపటి కీర్తి, మేడా రాజేష్‌, పరిటాల వెంకటనర్సయ్యతో పాటు నల్లమల వెంకటేశ్వరరావు, షేక్‌ రఫీ, షేక్‌ లాల్‌ మహ్మద్‌, తుమ్మల రాణాప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

యూరియా వాడకాన్ని తగ్గించాలి

మధిర: రైతులు పంటల్లో యూరియా వాడకాన్ని తగ్గించాలని మధిర వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త రుక్మిణిదేవి సూచించారు. మండలంలోని దెందుకూరు రైతువేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సు సోమవారం నిర్వహించగా ఆమె మాట్లాడారు. యూరియా వాడకాన్ని తగ్గిస్తే ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. అంతేకాక మేలైన విత్తనాల ఎంపిక, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మధిర ఏడీఏ విజయ్‌ చంద్ర, ఏఓ సాయిదీక్షిత్‌, ఏఈఓ ప్రవల్లిక, రైతులు పాల్గొన్నారు.

పురాతన కాలం నాటి రాతిస్తంభం

నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని బౌద్ధస్థూపానికి సమీప పొలంలో కాకతీయుల కాలం నాటిదిగా పలకల రాతి స్తంభాన్ని గుర్తించారు. ఈ అంశంపై తెలంగాణ చరిత్ర బృందం కోకన్వీనర్‌ కట్టా శ్రీనివాస్‌, పసుమర్తి శ్రీనివాస్‌ సోమవారం వివరాలు వెల్లడించారు. భూమిపై రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు, ఎనిమిది అంగుళాల మందంతో ఉన్న రాతి ఫలకం బయటపడిందని తెలిపారు. దీనిపై డమరుకం, త్రిశూలంతో పాటు సూర్యచంద్రుల చిహ్నాలు ఉన్నాయని పేర్కొన్నారు. భూమి నుంచి పూర్తిగా వెలికితీసి పరిశీలిస్తే మరిన్ని ఆధారాలు లభించవచ్చని చెబుతున్నారు.

సింగరేణి క్రికెట్‌

టోర్నీ విజేత బెల్లంపల్లి

సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని జయశంకర్‌ గ్రౌండ్‌లో మూడు రోజులపాటు జరిగిన సింగరేణి ఎగ్జిక్యూటివ్‌ క్రికెట్‌ టోర్నీలో బెల్లంపల్లి రీజియన్‌ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కొత్తగూడెం జట్టుపై విజయం సాధించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్‌ (ఈ అండ్‌ ఎం) సత్యనారాయణరావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళా విభాగంలో కొత్తగూడెం జట్టు విజేతగా నిలవగా, బెల్లంపల్లి టీమ్‌ రన్నర్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో జీఎంలు ఎం.శాలేంరాజు, మనోహర్‌తోపాటు కోటిరెడ్డి, పాలడుగు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సమ్మెకు జాతీయ

సంఘాల మద్దతు

సింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 20న జరిగే సమ్మెకు అన్ని జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని అఖిల పక్షం నాయకులు వెల్లడించారు. కొత్తగూడెం రుద్రంపూర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో సోమవారం జరిగినఅఖిలపక్ష సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. అన్ని సంఘాల మద్దతుతో సమ్మెను విజయవంతం చేస్తామని తెలిపారు. ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్‌, సీఐటీయూ, ఇఫ్టూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

రేపు డిప్యూటీ సీఎం  భట్టి పర్యటన
1
1/1

రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement