
బౌద్ధక్షేత్రం అభివృద్ధిపై దృష్టి సారించాలి
నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలో కెల్లా అతి పెద్దదైన నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం సరి కాదని సమతా సైనిక్‌తల్ దక్షిణ భారతదేశ అధ్యక్షుడు రేజర్ల రాజేష్ పేర్కొన్నారు. బౌద్ధక్షేత్రం వద్ద సోమవారం బుద్ధ జయంతి ఉత్సవలు నిర్వహించగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం నాగార్జునసాగర్‌ను అభివృద్ధి చేసిన విధంగా నేలకొండపల్లి క్షేత్రంపైనా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది బుద్ధ జయంతి ఉత్సవాలను లక్షలాది మందితో ఇక్కడ నిర్వహించి, సీఎం రేవంత్‌రెడ్డిని అహ్వనిస్తామని తెలిపారు. కాగా, బుద్ధుడి మార్గాన్ని భవిష్యత్ తరాల వారికి అందించే బాధ్యత అందరూ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూఢనమ్మకాల నిర్మూలన సంస్థ వ్యవస్థాపకుడు బైరి నరేష్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పగిడికత్తుల ఈదయ్య, పెద్దపాక వెంకటి,రాజేశ్వరరావు, రవి, సంపత్, బాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
సమతా సైనిక్ దక్షిణ భారత
అధ్యక్షుడు రాజేష్