
బాల్‌బ్యాడ్మింటన్‌కు కేరాఫ్‌గా..
● బోనకల్‌లో ఏటా వేసవిలో క్రీడా శిక్షణ శిబిరం ● 22 ఏళ్లుగా కోచ్ లింగయ్య ఆధ్వర్యాన నిర్వహణ ● జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాకారులు
బోనకల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో 22 ఏళ్లుగా వేసవిలో బాల్‌బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఎందరో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటారు. శిబిరాల నిర్వహణ, కఠోర శిక్షణలో కోచ్ అమిరేశి లింగయ్య కీలకంగా నిలుస్తూ క్రీడాకారులకు చేయూతనిస్తున్నారు.
తొలుత యూత్ ద్వారా..
1997లో బోనకల్‌లో శాంతి స్నేహా యూత్‌ను నెలకొల్పిన లింగయ్య బాల్‌బ్యాడ్మింటన్ క్రీడకు జీవం పోశాడు. కనుమరుగవుతున్న సంప్రదాయ క్రీడ అయిన బాల్‌బ్యాడ్మింటన్‌కు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సుమారు 200 మంది క్రీడాకారులకు శిక్ష ణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధం చేశాడు. తద్వారా బాల్‌బ్యాడ్మింటన్ క్రీడకు కేరాఫ్‌గా బోనకల్ నిలుస్తోంది. దాతల సహాయ సహకారాలతో అనేకమంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇదే గ్రామంలో ఏటా పాఠశాల విద్యార్థులను సబ్‌జూనియర్, జూనియర్, సీనియర్ గ్రూప్‌లుగా విభజించి శిక్షణ ఇస్తున్నాడు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యత సంపాదించి ఉన్నత చదువులు చదివి స్సోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందడం విశేషం.
ప్రస్తుతం 40 మంది..
ఈ ఏడాది 40 మంది క్రీడాకారులతో వేసవి శిక్షణా శిబిరం ప్రారంభమైంది. నెలపాటు ఈ శిక్షణా శిబి రం నిర్వహించనుండగా.. ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులకు ఆటలో మెళకువలు నేర్పుతూ నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. బోనకల్‌లో రెండు గురుకుల పాఠశాలలు, కస్తూర్బాగాంధీ పాఠ శాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో విద్యార్థులు అధికంగా ఉండడంతో వేసవి శిక్షణా శిబిరం క్రీడాకారుల తో కళకళలాడుతోంది. అలాగే, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులు కూడా ఈ శిక్షణా శిబిరంలోనే తర్ఫీదు పొందడం విశేషం.

బాల్‌బ్యాడ్మింటన్‌కు కేరాఫ్‌గా..

బాల్‌బ్యాడ్మింటన్‌కు కేరాఫ్‌గా..