కల్తీ పాల దందా.. | - | Sakshi
Sakshi News home page

కల్తీ పాల దందా..

Apr 9 2025 1:00 AM | Updated on Apr 9 2025 1:00 AM

కల్తీ

కల్తీ పాల దందా..

● విక్రేతలపై కొనుగోలుదారుల ఆగ్రహం ● శాంపిళ్లు సేకరించిన ఆహార తనిఖీ అధికారులు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆర్గానిక్‌ పేరుతో కల్తీ పాలు విక్రయిస్తున్నారంటూ పలువురు ఖమ్మంలోని ఓ పాల విక్రయ కేంద్రం వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. ఖమ్మం ఏసీపీ కార్యాలయం ఎదుట బొమ్మిశెట్టి నేలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదిక పేరిట ఏర్పాటుచేసిన షాపులో కొన్నాళ్లుగా కొనుగోలు చేస్తున్న పాలు వేడి చేయగానే గడ్డ కడుతున్నాయని ఆరోపించారు. ఈమేరకు బ్యాంక్‌ కాలనీకి చెందిన కొల్లు రామారావు మంగళవారం లీటరు పాలు రూ.90తో కొనుగోలు చేయగా, ఇంట్లో వేడి చేయగానే గడ్డ కట్టగానే వాసన వచ్చిందని తెలిపారు. దీంతో కేంద్రానికి వచ్చిన ఆయన విక్రయదారులను నిలదీశాడు. ఈ విషయమై ఆహార తనిఖీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు చేరుకుని శాంపిల్లు సేకరిస్తుండగానే మరో ఇద్దరు వచ్చి ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. ఇక ఆర్గానిక్‌ తేనె అంటూ కల్తీ జరిగిందని అంటగట్టారని షాప్‌ నిర్వాహకులపై ఖమ్మంకు చెందిన పరమేశ్వర్‌ అదే సమయాన ఫిర్యాదు చేయడం గమనార్హం.

కేఎంసీలో మహిళ ఫిర్యాదు

గొల్లగూడెం రోడ్డులోని ఓ డెయిరీ వద్ద అమ్మే పాలలో కల్తీ చేస్తున్నారని కేఎంసీలోని ఆహార తనిఖీ అధికారులకు మౌనిక అనే మహిళ ఫిర్యాదు చేసింది. చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంటున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

కల్తీమయం..

జిల్లా కేంద్రంలో వ్యాపారులు లైసెన్స్‌ తీసుకోకపోవడమే కాక కల్తీ వస్తువులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారని, అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కల్తీపాలు విక్రయించారని ఆరోపణలు వచ్చినబొమ్మిశెట్టి నెలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదికకు కూడా నిర్వాహకులు అనుమతి కానీ లైసెన్స్‌ కానీ తీసుకోలేదని గుర్తించారు. అయితే, ఈ షాప్‌ వద్ద మంగళవారం వినియోగదారులు ఆందోళన చేస్తున్న సమయాన అక్కడికి వచ్చిన ఆహార తనిఖీ అధికారులు, సిబ్బంది అందరినీ మేనేజ్‌ చేసుకోవాలని వ్యాపారికి సలహా ఇచ్చినట్లు పలువురు ఆరోపించారు.

శాంపిళ్లు సేకరించాం..

బొమ్మిశెట్టి నేలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదికలో పాలు, తేనె కల్తీ జరుగుతోందన్న ఫిర్యాదులతో శాంపిళ్లు సేకరించాం. గొల్లగూడెం రోడ్డులోని ఓ షాప్‌లో కూడా శాంపిళ్లు తీసుకున్నాం. హైదరాబాద్‌ ల్యాబ్‌ నుంచి 15 రోజుల్లోగా ఫలితాలు వస్తాయి. అంతేకాక లైసెన్స్‌ లేకుండా పాలు విక్రయిస్తున్న వారు 15 రోజుల్లోగా లైసెన్స్‌ తీసుకోవాలని ఆదేశించాం.

– ఆర్‌.కిరణ్‌కుమార్‌, జిల్లా గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

కల్తీ పాల దందా..1
1/1

కల్తీ పాల దందా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement