
భూసార పరీక్ష కేంద్రం తనిఖీ..
రఘునాథపాలెంలోని భూసార పరీక్ష కేంద్రాన్ని గురువారం కలెక్టర్ పరిశీలించి విత్తన తనిఖీల ప్రక్రియపై ఆరా తీశారు. విత్తన పరీక్షల్లో వేగం పెంచాలని, ఫలితం వచ్చాకే రైతులకు విక్రయించాలని అన్నారు. విత్తనాలు జిల్లాకు చేరగానే పరీక్షలు చేపట్టాలని, శాంపిల్ ఇచ్చిన నాలుగు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని అన్నారు. మట్టి పరీక్షల తీరుపైనా ఆరా తీశారు. పీఏసీఎస్‌ను పరిశీలించి విత్తనాల విక్రయం, సరఫరా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ రైతులకు జీలుగు విత్తనాల పంపిణీ చేశారు. అనంతరం విత్తన షాపును తనిఖీ చేశారు. ఆ తర్వాత రాములుతండాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను తనిఖీ చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీఏఓ విజయనిర్మల, వైరా కేవీకే శాస్త్రవేత్త రవికుమార్, డీఈఓ సోమశేఖరశర్మ, రఘునాథపాలెం ఎంఈఓ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ డీఈ చంద్రశేఖర్, ఏడీఏలు సరిత, శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, ఏఓలు రాజు, చాయా, ఇంటూరి భాస్కరరావు, సొసైటీ సీఈఓ ఎం.వెంకటేశ్వర్లు ఉన్నారు.