ప్రమాదవశాత్తు చెరుకు తోట దగ్ధం | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు చెరుకు తోట దగ్ధం

Published Thu, Nov 16 2023 12:34 AM

నిందితుడు, గంజాయితో ఎకై ్సజ్‌ పోలీసులు - Sakshi

నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు చెరుకు తోట దగ్ధమైన ఘటన మండలంలోని చెన్నారంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు వెంకన్న, సంగయ్య, గోపి చెరుకు సాగు చేయగా, వీరి పక్క పొలంలోని రైతు బుధవారం చెత్తకు నిప్పటించాడు. దీంతో మంటలు ఎగిసిపడి రైతుల చెరుకు తోటలు కాలిపోవడమే కాక గ్రామం వైపు వస్తుండడంతో స్థానికులు బకెట్లతో నీళ్లు పోస్తూ అదుపు చేశారు. ఈ ఘటనలో దాదాపు రూ.5లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.

రూ.2.50లక్షల విలువైన గంజాయి స్వాధీనం

ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేషన్‌లో బుధవారం ఎకై ్సజ్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 10కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్‌లోని రెండో నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఖమ్మం ఎకై ్సజ్‌ సీఐ–2 రాజిరెడ్డి ఆధ్వర్యాన తనిఖీలు నిర్వహిస్తుండగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుడ్డు రూ.2.50లక్షల విలువైన గంజాయితో పట్టుబడ్డాడు. తనిఖీల్లో ఎస్సై సరిత, సిబ్బంది మౌంకార్‌, నర్సింహ, వీరభద్రం, గురుప్రసాద్‌, సురేందర్‌, రాధ, భద్రమ్మ, చెన్నమ్మ పాల్గొన్నారు.

కొండచిలువ హతం

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మంలోని బల్లేపల్లి నుండి వేపకుంట్ల వెళ్లే రహదారిపై ఎనిమిది అడుగుల కొండచిలువను గ్రామస్తులు హతం చేశారు. ప్రధాన రోడ్డుపై బుధవారం కొండచిలువ వెళ్తుండగా స్థానికులు గుర్తించారు. సమీపంలో నివాసాలు ఉండడంతో ఆందోళనకు గురైన వారు దాన్ని హతమార్చారు.

మట్టి టిప్పర్లు స్వాధీనం

రఘునాథపాలెం: ఎలాంటి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని జింకలతండా రోడ్డులో బుధవారం చేపట్టిన తనిఖీల్లో టిప్పర్లను స్వాధీనం చేసుకోగా, మైనింగ్‌ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement