
జూలూరుపాడు: విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తున్న రాష్ట్రబృందం సభ్యులు
బూర్గంపాడు/కొత్తగూడెంరూరల్/జూలూరుపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఉన్నతి, లక్ష్య కార్యక్రమాలను మరింతగా మెరుగుపరచాలని విద్యాశాఖ కేంద్ర, రాష్ట్ర కమిటీల సభ్యులు సూచించారు. బూర్గంపాడు ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం సందర్శించిన వారు ఉన్నతి, లక్ష్య అమలును పరిశీలించి విద్యార్థులకు ప్రణాళికాయుతంగా బోధించేలా ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. అలాగే, లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్‌కాలనీ పంచాయతీ పరిధి ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలను ఎస్‌ఈఆర్‌టీ సభ్యులు సందర్శించి తొలి మెట్టు అమలుపై పర్యవేక్షించడంతో పాటు రికార్డులు తనిఖీ చేశారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సభ్యుడు ఎస్.రవికుమార్‌తో పాటు విశాల్, మురళి, కార్తీక్, జుంకీలాల్, ఎస్.శ్రీనివాస్, బాలాజీ, జ్యోతిరాణి, ఎస్‌కే ఖాసీంపాషా, నాగేశ్వరరావు, శౌరి ఇన్నయ్య, తపస్సుమ్, కల్యాణి పాల్గొన్నారు. కాగా, జూలూరుపాడు మండలంలోని దండుమిట్టతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను స్టేట్ కౌన్సిల్ బృందం సభ్యులు సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. అలాగే, ఉన్నతి, లక్ష్య అమలుపై ఆరా తీశారు. రాష్ట్ర పరిశీలకులు అనిల్‌కుమార్, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.