శివాలయంలో కలెక్టర్‌ దంపతుల పూజలు

మాట్లాడుతున్న కృష్ణ  - Sakshi

కూసుమంచి: మండల కేంద్రంలోని కాకతీ యుల నాటి శివాలయాన్ని కలెక్టర్‌ వీ.పీ. గౌతమ్‌ దంపతులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారితో అర్చకులు శేషగిరిశర్మ అభిషేకం, ప్రత్యేక పూజలు జరిపించారు. తొలుత కలెక్టర్‌ దంపతులకు ఆలయ ఈఓ శ్రీకాంత్‌, చైర్మన్‌ కొక్కిరేణి వీరస్వామి, అర్చకులు, డైరెక్టర్లు స్వాగతం పలకగా పూజల అనంతరం సత్కరించారు.

26న మహిళా క్రికెటర్లను

ఎంపికలు

ఖమ్మం స్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లాస్థాయిలో ప్రతిభ కలిగిన మహిళా క్రికెటర్లను ఎంపిక చేసేందుకు ఈనెల 26న పోటీలు నిర్వహిస్తున్నట్లు క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌.వెంకట్‌, ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్‌ ఎం.డీ.మసూద్‌ పాషా తెలిపారు. ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరిగే ఎంపిక పోటీల్లో 25మందిని ఎంపిక చేసి మూడేళ్ల పాటు స్కాలర్‌షిప్‌ అందజేయడమే కాక ఉచిత క్రికెట్‌ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. భారత క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌లు రవిశాస్త్రి, అరుణ్‌, శ్రీధర్‌ నేతృత్వాన హిందుస్థాన్‌ యూనీలివర్‌ లిమిటెడ్‌ సహకారంతో ‘బియాండ్‌’ ప్రోగ్రాం పేరిట ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళా క్రికెటర్లు వయస్సు ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో 26న ఉదయం 8గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలని, వివరాలకు 79818 81095 నంబర్‌లో సంప్రదించాలని వారు సూచించారు.

ఖమ్మం పాత మున్సిపాలిటీలో పీఎఫ్‌ కార్యాలయం

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయంలో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌ఓ) కార్యాలయం ఏర్పాటుచేసినట్లు శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎం.డీ.సలీంఖాన్‌ తెలి పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సంస్థల యజమాన్యాలు, ఉద్యోగులు, పెన్షనర్లు ఈ మార్పును గమనించాలని ఆయ న ఓ ప్రకటనలో కోరారు.

డీసీసీబీ పరిధిలో

మరో ఐదు బ్రాంచ్‌లు

నేలకొండపల్లి: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ) పరిధిలో ఉమ్మడి జిల్లాలో కొత్తగా మరో ఐదు బ్రాంచ్‌లు ఏర్పాటుకానున్నాయి. తాజాగా జరిగిన బ్యాంకు పాలక మండలి సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోగా, అనుమతి కోసం ఆర్‌బీఐకి ప్రతిపాదనలు పంపించినట్లు డీసీసీబీ సీఈఓ వీరబాబు తెలిపారు. ప్రస్తుత బ్రాంచ్‌లకు దూరంగా ఉన్న గ్రామాల రైతులకు మెరుగైన సేవలందించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని పాండురంగాపురం(ఖమ్మం అర్బన్‌), చెరువుమాదారం(నేలకొండపల్లి), కందుకూరు(వేంసూరు), కరుణగిరి(ఖమ్మం రూరల్‌), సుజాతనగర్‌ల్లో ఈ బ్రాంచ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. తాజాగా బ్యాంకు అధికారులు నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో పర్యటించి అనువైన భవనాల కోసం పరిశీలించినట్లు సమాచారం. పంట రుణాలు అందిస్తూ రైతులకు అండగా ఉండడమే కాక విద్య, వ్యాపార రుణాలు, డిపాజిట్ల సేకరణలో వాణిజ్య బ్యాంకులకు దీటుగా నిలుస్తున్న డీసీసీబీ ద్వారా మరిన్ని బ్రాంచ్‌లు ఏర్పాటుచేయడంతో ఆయా ప్రాంతాల రైతులు, ప్రజలకు మెరుగైన సేవలందుతాయని భావిస్తున్నారు.

రాష్ట్ర మహాసభలను

జయప్రదం చేయాలి

మణుగూరు రూరల్‌ : ఏప్రిల్‌ 2,3 తేదీల్లో కొత్తగూడెంలో జరిగే ఇఫ్టూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు అరెల్లి కృష్ణ కోరారు. మణుగూరు ఏరియాలోని పలు విభాగాల వద్ద జరిగిన ప్రచార సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సభకు కాంట్రాక్ట్‌ కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఇఫ్టూ పోరాటాల వల్లే కాంట్రాక్ట్‌ కార్మికులకు బ్యాంక్‌ వేతనాలు, సీఎంపీఎఫ్‌, ఎనిమిది గంటల పని విధానం వంటివి సాధ్యమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీసీడబ్ల్యూయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ రాసుద్దీన్‌, బ్రాంచ్‌ కార్యదర్శి మంగీలాల్‌, మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కే వాసు, వీర్రాజు, సాంబశివరావు, శివ, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top