రాజ్యాంగంపై దాడి..

ఇటీవల అకాల వర్షాలతో నేలకొరిగిన మొక్కజొన్న చేను - Sakshi

బీజేపీ నేతృత్వాన రాజ్యాంగంపై దాడి జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.

8లో

గురువారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2023

వెన్ను విరిచిన వరుణుడు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఇటీవల నాలుగు రోజుల పాటు కురిసిన అకాల వర్షాలు జిల్లా రైతాంగంపై కోలుకోలేని రీతిలో దెబ్బతీశాయి. ఉమ్మడి జిల్లాలో అన్ని పంటలు కలిపి 33,638 ఎకరాల్లో దెబ్బతినగా.. అత్యధికంగా మొక్కజొన్నకే నష్టం వాటిల్లింది. ఈ పంట కంకి పొట్ట దశలో ఉండగా కురిసిన వర్షాలు రైతుల వెన్నువిరిచాయి. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండల రైతాంగంపై వర్షం తీవ్రప్రభావాన్ని చూపింది. ఈమేరకు అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో గురువారం పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బోనకల్‌ మండలం రామాపురంలో పరిశీలిస్తారు.

ఆవిరైన మొక్కజొన్న రైతుల ఆశలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల నాలుగు రోజుల పాటు అకాల వర్షాల ధాటికి యాసంగిలో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలతో ఉమ్మడి జిల్లాలో 33,637 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించగా.. ఇందులో ప్రధానంగా మొక్కజొన్న పంటకే నష్టం జరిగింది. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా బోనకల్‌ మండలంలో పంట నష్టం జరగడంతో సీఎం గురువారం ఈ మండలానికి రానున్నారు. ఖమ్మం జిల్లాలో 90,602 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయగా.. వర్షాలతో 30,792 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. ప్రస్తుతం కంకి పొట్ట దశలో ఉండగా, మరో నెలలో చేతికందనుండగా వరుణుడు రైతుల వెన్నువిరి చాడు. అలాగే, ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 49 గ్రామాల్లో 1,180 మంది రైతులకు చెందిన 2,599 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇక్కడ కూడా అత్యధికంగా 1,062 మంది రైతులకు చెందిన 2,179 ఎకరాల్లో మొక్కజొన్న పంట చేతికి అందకుండా పోగా, 250 ఎకరాల మేర వరి పంటను 45 మంది రైతులు నష్టపోయారు.

బోనకల్‌ మండలంలోనే అత్యధికం

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందుతుందనే ఉద్దేశంతో ఈసారి బోనకల్‌ మండల రైతులు మొక్కజొన్న పంటకు ప్రాధాన్యత ఇచ్చారు. సాగర్‌ నీటి విడుదలలో ఇబ్బందులు ఎదురైనా రాత్రింబవళ్లు శ్రమిస్తూ పంటను కాపాడుకున్నారు. ఇంతలోనే వరుణుడు మొక్కజొన్నను మింగేశాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోనకల్‌ మండలంలోని 18 గ్రామాల్లో 7,092 మంది రైతులు 10,324 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వర్షాల ప్రభావంతో ఈ పంట పూర్తిగా చేతికి అందకుండా పోయింది. జిల్లావ్యాప్తంగా 30,792 ఎకరాల్లో మొక్కజొన్న నష్టపోగా.. బోనకల్‌ మండలంలోనే 10,324 ఎకరాల్లో దెబ్బతినడం గమనార్హం. ఇక చింతకాని మండలంలోని 12 గ్రామాలకు చెందిన 4,500 మంది రైతులకు చెందిన మొక్కజొన్న 6,500 ఎకరాల్లో పాడైంది.

రామాపురంలో మొక్కజొన్న కంకులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌,

వాతావరణ ం

గురువారం జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. ఉదయం నుంచే ఎండ మొదలై మధ్యాహ్నానికి తీవ్రమవుతుంది.

రామాపురానికి ముఖ్యమంత్రి

అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట లను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం జిల్లాలోని బోనకల్‌ మండలంలో పర్యటించనున్నారు. హెలీకాప్టర్‌ ద్వారా బోనకల్‌ మండలంరామాపురం చేరుకోనున్న సీఎం.. ఈ గ్రామంతో పాటు గార్లపాడులోనూ పంట నష్టాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం. ఉదయం 10.15గంటలకు హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న సీఎం కేసీఆర్‌ 11.15గంటలకు ఇక్కడకు చేరుకుని దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. సుమారు అరగంటకు పైగా సీఎం పర్యటన సాగనుండగా, ఆతర్వాత మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగరకు వెళ్తారని బుధవారం రాత్రి అధికారిక సమాచారం వెలువడింది. ఈమేరకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచనలతో కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ బోనకల్‌ మండలంలోని ముష్టికుంట్ల, రావినూతల, గార్లపాడు, రామాపురంల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు.

న్యూస్‌రీల్‌

సారూ.. మా గోస చూడండి

నేడు బోనకల్‌ మండలం

రామాపురంలో సీఎం కేసీఆర్‌ పర్యటన

పంట నష్టాన్ని పరిశీలించనున్న ముఖ్యమంత్రి

రాత్రి పొద్దుపోయే వరకు ఏర్పాట్లలో నిమగ్నమైన కలెక్టర్‌, సీపీ

అకాల వర్షాలతో ఉమ్మడి జిల్లాలో 33వేల ఎకరాలకు పైగా పంట నష్టం

అత్యధిక నష్టం బోనకల్‌ మండల మొక్కజొన్న రైతులకే..

జిల్లాలో అత్యధికంగా మొక్కజొన్న నష్టం జరిగిన మండలాల వివరాలు

మండలం రైతులు ఎకరాలు

బోనకల్‌ 7,092 10,324

కొణిజర్ల 1,994 5,255

చింతకాని 4,500 6,500

ముదిగొండ 3,750 4,200

వైరా 766 1,758

మధిర 466 867

రఘునాథపాలెం 229 471

బోనకల్‌: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు బోనకల్‌ మండలం రామాపురానికి సీఎం కేసీఆర్‌ గురువారం రానున్నారు. ఈమేరకు పర్యటన బుధవారం సాయంత్రం ఖ రారు కావడంతో కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులంతా మండలానికి చేరుకున్నారు. అధికార యంత్రాంగంతో ముష్టికుంట్ల రైతువేదికలో సమావేశమైన వారు సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించి సూచనలు చేశారు. అక్కడే రైతులతో కూడా మా ట్లాడారు. అనంతరం రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాల్లో పర్యటించి వర్షంతో నేలమట్టమైన మొక్కజొన్న పంటను పరిశీలించారు. అకాల వర్షంతో కోలుకోలేని రీతిలో నష్టపోయిన తమను ఆదుకోవాలని కౌలురైతులు పలువురు కలెక్టర్‌ను కోరారు. దీంతో పంటల నష్టం, రైతుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఆతర్వాత రామాపురంలో హెలీప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ వారియర్‌ ఇక్కడే ఉండగా.. సీఎం చేరుకునేది మొదలు పంటల పరిశీలన, రైతులతో మాట్లాడేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమాలోచనలు చేశారు. కాగా, మండలంలో మొక్కజొన్న పంట నష్టంపై ఇప్పటికే నివేదికలు సిద్ధమైనందున తమను ఆదుకునేలా సీఎం కేసీఆర్‌ ప్రకటన చేస్తారని రైతులు ఆశగాఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, జెడ్పీ సీఈఓ వీ.వీ.అప్పారావు, అడిషినల్‌ డీసీపీ సుభాష్‌చంద్రబోస్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాధికాగుప్తా, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంప్రసాద్‌, డీఏఓ విజయనిర్మల, ఆర్‌డీఓ రవీంద్రనాథ్‌, ఏసీపీ రెహమాన్‌, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ శ్వేత, ఎంపీడీఓ వేణుమాధవ్‌తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పలువురు పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top