
పతాక వందనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు
ఖమ్మంగాంధీచౌక్: ఉగాది పండుగ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) స్థాపకులు డాక్టర్ కేశవ్‌రామ్ బలీరాం హెగ్డేవార్ జన్మదినం సందర్భంగా బుధవారం ఖమ్మం త్రీటౌన్ గుట్టలబజార్ శ్రీరామకృష్ణ విద్యాలయం వేదికగా పదసంచలన్ నిర్వహించారు. జీవితం సకల అనుభూతుల సమ్మిశ్రమం, స్థిత ప్రజ్ఞత అలవర్చుకోవడమే వివేకి లక్ష్యంగా సందేశమిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శ్రేణులు పదసంచలన్ నిర్వహించాయి. త్రీటౌన్‌లోని పలు వీధుల్లో కార్యక్రమాన్ని నిర్వహించగా, ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యులు గంటా తిరుమల్, మధు, కాటేపల్లి లక్ష్మీనారాయణ, మున్షుక్‌బాయ్ పటేల్, శృంగేరి ధర్మాధికారి, సంతోష్ గౌతం, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.