
ఖమ్మంరూరల్: మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో ఇంటూరి మోటార్స్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ట్రాక్టర్ షోరూంను పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులకు ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు షోరూం ఏర్పాటు అభినందనీయమని తెలిపారు. రైతులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. షోరూం మేనేజర్ కె.జయరాజు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సోలిస్ యాన్మర్ ట్రాక్టర్లు ప్రస్తుత వ్యవసాయావసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. షోరూంలో ఎక్ఛేంజ్, ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎంపీపీ బెల్లం ఉమ, జెడ్పీటీసీ సభ్యులు ఎ.వరప్రసాద్, ఇంటూరి బేబీ, షోరూం యజమాని ఇంటూరి శేఖర్, కంపెనీ ప్రతినిధులు రాజేశ్‌మోహన్, అరుణ్‌కుమార్, సురేందర్‌పాల్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.