
క్రీడాకారులకు టీషర్ట్‌లు అందజేస్తున్న వెంకటరమణ, తదితరులు
రఘునాథపాలెం: క్రీడలతో యువతలో స్నేహ సంబంధాలు బలపడడమే కాక ప్రతిభ ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఖమ్మం మార్కెట్ మాజీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ తెలిపారు. రఘునాథపాలెంలో బ్లూస్టార్ యూత్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికే ప్రతీ జీపీలో క్రీడాప్రాంగణాలు నిర్మించిందని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కాగా, పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచే వారికి రూ.75 వేలు, రూ.50 వేలు, రూ.25 వేల నగదు బహుమతులను ఇచ్చేందుకు మద్దినేని వెంకటరమణ, బానోత్ ప్రవీణ్‌కుమార్, ముద్రబోయిన వెంకటేశ్వర్లు ముందుకొచ్చారు. పోటీలకు మొత్తం 24 జట్లు హాజరు కాగా, టీషర్ట్‌లను గుగులోత్ లక్ష్మణుడు సమకూర్చారు. నాయకులు గుడిపుడి రామారావు, మందా వెంకటయ్య, కృష్ణ, బోడా ఉపేందర్, సీహెచ్.రామయ్య, కంపాటి రవి, బానోత్ బాలునాయక్ పాల్గొన్నారు.