
మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
కామేపల్లి(కారేపల్లి): కామేపల్లి మండలం కొత్తలింగాలలోని కోటమైసమ్మ తల్లి ఆలయంలో ఏటా ఉగాది సందర్భంగా నిర్వహించే జాతర బుధవారం ఘనంగా జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరున్న కోటమైసమ్మకు మొక్కులు చెల్లించేందుకు వివిధ జిల్లాల భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈసందర్భంగా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, పలువురు తమ వాహనాలకు పూజ చేయించడంతో పాటు వంటలు చేసుకుని సాయంత్రం వరకు ఇక్కడే గడిపారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి ఆడపడుచులు రావడంతో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. కాగా, జాతరకు హాజరైన భక్తులకు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబుయాదవ్ ఆధ్వర్యాన పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సమత, ఈఓ ఎన్.శేషగిరిరావు, ఆలయ చైర్మన్ మల్లెంపాటి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు, సిబ్బంది బి.వరప్రసాద్, కె.సత్యనారాయణ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు డి.హనుమంతరావు, నాయకులు అంతోటి అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
పూజలు చేసిన ఎమ్మెల్యే హరిప్రియ,
భారీగా తరలివచ్చిన భక్తులు

భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్న దాతలు