
అవార్డులు అందుకున్న వారితో నిర్వాహకులు, అతిథులు
ఖమ్మంగాంధీచౌక్: సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో సేవలందిస్తున్న ఉమ్మడి జిల్లాలోని పలువురికి స్ఫూర్తి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యాన బుధవారం ఉగాది అవార్డులు ప్రదానం చేశారు. ఖమ్మం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఖమ్మం కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు నాగబత్తిని రవి, వేల్పుల విజేత తదితరులు పాల్గొని ఈ అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య దంపతులు, సకిని రామచంద్రయ్యతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులైన సింధు తపస్వి, గాజుల భారతి శ్రీనివాస్, ఏలూరి మీన, వీ.ఎస్.మల్లీశ్వరి, ఎండీ.ఫఫీ ఉన్నారు. ఈ సందర్భంగా జ్యోతినివాస్‌లోని అంధ విద్యార్థులకు నాగబత్తిని రవి, మామిడి వినయ్ తదితరులు ఆర్థిక సాయంఅందజేశారు. అనంతరం శ్వేతవర్దిని, సాహితి, మామిడి యశ్విత చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.