ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గృహాలు, వ్యాపార సముదాయాల నుండి వెలువడే నీటిని శుద్ధీకరించేందుకు ప్రభుత్వం నగరానికి మరో మూడు ఎస్‌టీపీ(సీనరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లను మంజూరు చేసింది. రూ.280 కోట్ల తో నగరంలోని మూడు ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు నిధులు కేటాయించింది. ఇప్పటికే గోళ్లపాడు చానల్ ద్వారా మున్నేరులో కలిసే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు శ్రీనివాసనగర్‌లో ఒక ప్లాంట్ నిర్మి స్తున్నారు. ఇప్పుడు మరో మూడు ప్లాంట్ల నిర్మాణా నికి అనుమతి లభించింది. పుట్టకోట, దానవాయిగూడెం, మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మున్నేరు, ప్రధాన చెరువుల్లో మురుగు కలవడంతో నీరు కలుషితమవుతున్నందున ప్రభుత్వం మరో మూడు ఎస్‌టీపీలను మంజూరు చేసినట్లు సమాచారం.
రూ.280 కోట్ల నిధులు కేటాయింపు