
కొణిజర్ల : మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఏఓ విజయనిర్మల
బోనకల్/కొణిజర్ల: బోనకల్, కొణిజర్ల మండలాల్లో ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న పంటలను అదనపు కలెక్టర్ మధుసూదన్, జిల్లా వ్యవసాయాధికారి విజ యనిర్మల మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మీపురం, గోవిందాపురం, గార్లపాడు, రామాపురం, రావినూతల, కొత్తకాచారం, పాత కాచారంలో వారు పర్యటించారు. తహసీల్దార్ శ్వేత, సర్పంచ్ సూరంపల్లి రామారావు, ఏఓలు అబ్బూరి శరత్‌బాబు, బాలాజీ, రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్, ఆర్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.
పంట నష్టంపై కమిషనర్ టెలీ కాన్ఫరెన్స్
ఖమ్మంవ్యవసాయం: అకాల వర్షాలతో పంట నష్టంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 19,732 మంది రైతులకు చెందిన 31,038 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు వివరించారు. ఇందులో ఎక్కువగా మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు.