
నృత్యం చేస్తున్న విద్యార్థినులు
ఖమ్మం సహకారనగర్: నగరంలోని న్యూ ఇరా పాఠశాల 28వ వార్షికోత్సవాన్ని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకుని శ్రద్ధగా చదువుకుంటూ వాటిని సాధించడమే కాక తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ వీ.పీ.గౌతమ్ మాట్లాడారు. ఆతర్వాత పాఠశాల చైర్మన్ ఐ.వీ.రమణారావు, డైరెక్టర్ పి.భూమేశ్వరరావు మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందించటం ద్వారా వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించగా.. వివిధ పోటీ పరీక్షల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జూలూరి గౌరీశంకర్, పక్కన కలెక్టర్ గౌతమ్, పాఠశాల డైరెక్టర్లు