
అభివాదం చేస్తున్న నాయకులు
ఖమ్మం మయూరిసెంటర్/ఖమ్మం సహకారనగర్/సత్తుపల్లి/వైరా: తెలుగు నూతన సంవత్సరాది శోభకృత్‌నామ ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రజలకు శునాకాంక్షలు తెలి పారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే, ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కూడా వేర్వేరు ప్రకటనల్లో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్‌ఎండీసీ సీఎండీకి ఎమ్మెల్యే సండ్ర సన్మానం
సత్తుపల్లి/కల్లూరు: సింగరేణి సీఎండీగా విధులు నిర్వర్తిస్తూ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌డీసీఎం) సీఎండీ నియమితులైన ఎన్.శ్రీధర్‌ను హైదరాబాద్‌లో మంగళవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలిసి సత్కరించారు. ఆతర్వాత జల వనరుల శాఖ ఈఎన్‌సీ నాగేంద్రరావును కలిసి ఎన్నెస్పీ ఆయకట్టుకు ఏప్రిల్ 10వరకు నీరు విడుదల చేయాలని కోరారు. కాగా, కల్లూరు శాంతినగర్‌కు చెందిన ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు గౌడిపేరు జర్మియాబాబు హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా ఆయనను ఎమ్మెల్యే సండ్ర పరామర్శించారు.
పెండింగ్ వేతనాలు, బిల్లుల కోసం 24న నిరసన
ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయుల వేతనాలు, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాల నే డిమాండ్‌తో ఈనెల 24న జిల్లాలోని ఖజానా శాఖ కార్యాలయాల వద్ద నిరసన తెలపనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు జీ.వీ.నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు, వడ్డె వెంకటేశ్వరరావు, సలవాది విజయ్ తెలిపారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. నాయకులు మన్సూర్, యాదగిరి, హసేన్, రామకృష్ణ, బాబురావు, ఏ.బన్సీలాల్, ఏ.నాగేశ్వరరావు, పి.వెంకన్న, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రూ.54 లక్షలకు
పాలేరు సంత వేలం
కూసుమంచి: మండలంలోని పాలేరు వారాంతపు సంత నిర్వహణను ఏడాది పాటు అప్పగించేందుకు మంగళవారం వేలం నిర్వహించారు. ప్రభుత్వ మద్ధతు ధర రూ.62 లక్షలతో వేలం ప్రారంభించగా 17మంది వ్యాపారులు హాజరయ్యారు. చివరకు నకిరేకల్‌కు చెందిన జాల సైదులు అత్యధికంగా రూ.54 లక్షలకు పాడి సంత కై వసం చేసుకున్నాడు. గత ఏడాది వేలంలో రూ.48.30 లక్షల ఆదాయం రాగా, ఈసారి రూ.5.70 లక్షలు పెరిగింది. ఎంపీడీఓ కరుణాకర్‌రెడ్డి, ఎంపీఓ రాంచందర్, సర్పంచ్ ఎడవెల్లి మంగమ్మ, ఎంపీటీసీ నాగమణితో పాటు యాకూబ్‌పాషా, నరేష్ పాల్గొన్నారు.