
గోదాంలో తనిఖీ చేస్తున్న జీఎస్టీ అధికారులు
మధిర: మధిరలోని పలు వ్యా పార సంస్థల్లో మంగళవారం సెంట్రల్ జీఎస్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జీఎస్టీ చెల్లింపులు లేకుండా పలు వురు వ్యాపారం చేస్తుండగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందనే ఫిర్యాదులతో తనిఖీలు నిర్వహించారు. సెంట్రల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాజా రత్నాకర్ ఆధ్వర్యాన వ్యాపార సంస్థలు, గోదాంలు, పార్సిల్ సర్వీస్ పాయింట్లలో సోదా చేసి రికార్డులు పరిశీలించారు. కాగా, తనిఖీల సమాచారం తెలుసుకున్న కొందరు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ రాజారత్నాకర్ మాట్లాడుతూ వ్యాపారులు ప్రతీ లావాదేవీపై నిబంధనల ప్రకారం జీఎస్టీ చెల్లించాలని సూచించారు. జీఎస్టీ అధికారులు రణధీర్, హేమంత్, వినాయక్ పాల్గొన్నారు.
ఈనెల 31న బార్ ఎన్నికలు
ఖమ్మం లీగల్: బార్ అసోసియేషన్ ఎన్నికలను ఈనెల 31న నిర్వహించనుండగా.. ఎన్నికల అధికారిగా ఎస్.సోమశేఖర్‌ను నియమించారు. ఈమేరకు ఆయ న ఆయన మంగళవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఈనెల 24న నామినేషన్ల పత్రాల స్వీకరిస్తామని, 25న ఉపసంహరణకు అవకాశం ఇచ్చి అదే రోజు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలి పారు. ఇక పోలింగ్ 31న ఉదయం 10నుండి సాయంత్రం 3గంటల వరకు నిర్వహించి, సాయంత్రం 4 గంటలకు ఫలి తాలు వెల్లడిస్తామని సోమశేఖర్ పేర్కొన్నారు. కాగా, బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా దిరిశాల కృష్ణారావు, ఆర్.సుధీర్‌సింగ్, ఎం.ఏ.తౌఫిక్, సీ.హెచ్.స్వర్ణకుమారి, నేరళ్ల శ్రీనివాసరావు, మల్లెంపాటి అప్పారావు, కార్యదర్శి పోస్టుకు చింతనిప్పు వెంకట్, మన్నేపల్లి బసవయ్య పోటీలో ఉన్నారు.
పాన్‌కార్డు పేరిట రూ.21వేలు స్వాహా
ఖమ్మంఅర్బన్: పాన్‌కార్డు అప్‌డేట్ చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి చేసిన ఫోన్‌కు స్పందించి ఓటీపీ చెప్పడంతో ఖాతా నుంచి రూ.21వేలకు పైగా నగదు స్వాహా అయిన ఘటన ఇది. నగరంలోని ఖానాపురానికి చెందిన సీహెచ్.వెంకటేశ్వరరావుకు ఈనెల 17న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి పాన్‌కార్డ్ అప్‌డేట్ చేస్తామంటూ నమ్మబలికి ఓటీపీ తెలుసుకున్నారు. ఆయన మంగళవారం బ్యాంకులో బ్యాలెన్స్ చూసుకోగా రూ.21,165 విత్‌డ్రా అయినట్లు తెలి యడంతో మోసపోయినట్లుగా గుర్తించి ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైలుకింద పడి ఆత్మహత్య
మధిర: వ్యక్తిగత కారణాలతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దెందుకూరుకు చెందిన కొలకలూరి వెంకటేశ్వర్లు(60) గ్రామానికి సమీపాన మధిర–తొండల గోపవరం స్టేషన్ల నడుమ మంగళవారం శ్రద్ధసేతు ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమేరకు మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ బాధ్యుల సాయంతో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ ఎస్సై పి.భాస్కర్‌రావు, హెడ్ కానిస్టేబుల్ శీలం వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
కోతుల దాడిలో గాయాలు
వైరారూరల్: కోతుల దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని నారపునేనిపల్లికి చెందిన ఆర్.ల క్ష్మయ్య మంగళవారం సెంటర్‌కు రాగా.. ఆయనపై కోతులు దాడి చేయడంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలై నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో ఆయనను వైరా ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు.