
స్వాధీనం చేసుకున్న కలపను పరిశీలిస్తున్న డీఎఫ్‌ఓ విక్రమ్‌సింగ్
తల్లాడ: మండలంలో గోపాలపేట, నరసింహారావుపేట, బాలపేట గ్రామాల్లో సామాజిక వనాలను జిల్లా అటవీ అదికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ మంగళవారం పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి అటవీ భూమిని సేకరించిన ప్రభుత్వం.. తల్లాడ మండలంలో నరసింహారావుపేట, గోపాలపేట, బాలపేటల్లోని రెవెన్యూ భూమి 24 హెక్టార్లను కేటాయించింది. ఈ భూముల్లో పెంచుతున్న సామాజిక వనాలను డీఎఫ్‌ఓ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బాలపేటలో అధికారులు స్వాధీనం చేసుకున్న 31 నార ఈప దిమ్మెలను పరిశీలించి సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి అరవింద్‌కుమార్, ఎఫ్‌బీఓ వెంకటేశ్వర్లు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.