
సమావేశంలో మాట్లాడుతున్న డీసీ జనార్దన్‌రెడ్డి
నేలకొండపల్లి: జిల్లా మీదుగా గంజాయి రవాణాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. నేలకొండపల్లి ఎకై ్స్సజ్ సర్కిల్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేసిన మద్యం లైసెన్స్‌దారులతో సమావేశమయ్యారు. అనంతరం జనార్దన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈనెలలో 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే, నేరాల నియంత్రణకు ప్రతీ కానిస్టేబుల్‌కు ఐదు గ్రామాల చొప్పున బీట్లుగా కేటాయించినట్లు చెప్పారు. ఆలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల సమీపాన బెల్ట్‌షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఈఎస్ నాగేందర్‌రెడ్డి, నేలకొండపల్లి సీఐ ఆర్.విజేందర్ పాల్గొన్నారు.