
డీడీని సన్మానిస్తున్న కలెక్టర్ గౌతమ్
●మండల పరిషత్‌లకు విడుదల చేసిన ప్రభుత్వం ●జిల్లాలో రూ.7.57 కోట్ల పనులకు ప్రతిపాదనలు
నేలకొండపల్లి: జిల్లాలోని మండల ప్రజాపరిషత్‌లకు ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో చేపట్టనున్న పనులను ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలోని మండలాలకు సంబంధించి దాదాపు రూ.7,57,72,743 మంజూరయ్యాయి. ఈ నేపథ్యాన నేలకొండపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం బ్లాక్ పంచాయతీ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీపీ వజ్జా రమ్య అధ్యక్షత వహించగా, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ శివ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధి కారులు పాల్గొన్నారు. 2011 జనాభా ప్రకారం చేపట్టాల్సిన పనులపై వారు చర్చించారు. ప్రధానంగా తాగునీరు, డ్రెయినేజీలు, సీసీ రహదారులతో పాటు అత్యవసర పనులు చేపట్టాలని నిర్ణయించారు.
మండలాల వారీగా మంజూరైన నిధులు
మండలం గ్రాంట్
ఖమ్మం రూరల్ రూ.53,78,514
సింగరేణి రూ.47,36,267
కల్లూరు రూ.46,99,589
కూసుమంచి రూ.45,28,078
నేలకొండపల్లి రూ.44,13,014
ముదిగొండ రూ.40,50,242
రఘునాథపాలెం రూ.39,92,210
తల్లాడ రూ.39,39,576
పెనుబల్లి రూ.38,21,575
కొణిజర్ల రూ.36,92,907
సత్తుపల్లి రూ.33,47,937
కామేపల్లి రూ.33,07,368
చింతకాని రూ.33,03,041
బోనకల్ రూ.31,62,698
ఏన్కూర్ రూ.27,17,421
మధిర రూ.26,91,049
ఖజానా శాఖ డీడీకి సన్మానం
ఖమ్మం సహకారనగర్: కరోనా వైరస్ సమయాన ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖజనా శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంటపల్లి సత్యనారాయణ రూపొందించిన కరోనా కార్టూన్లతో ఇటీవల పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకాన్ని సోమవారం కలెక్టర్ వీ.పీ.గౌతమ్ కలెక్టరేట్‌లో ఆవిష్కరించి సత్యనారాయణను అభినందించారు. అదనపు కలెక్టర్ స్నేహలత, డీఆర్వో శిరీష, అధికారులు, ఉద్యోగులు మోదుగు వేలాద్రి, ప్రసన్నకుమార్, కృష్ణకుమారి, విజయ్ కుమార్, సాగర్, మంజుల, శారద తదితరులు పాల్గొన్నారు.

నేలకొండపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ రమ్య