
సదస్సులో మాట్లాడుతున్న జగన్మోహనరావు
వైరా: నాణ్యమైన విత్తనాలు సమకూర్చుకుని పంటలు సాగుచేస్తేనే రైతులు అధిక దిగుబడి సాధించగలుగుతారని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం విత్తన సంచాలకుడు డాక్టర్ పి.జగన్మోహనరావు తెలిపారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం విత్తనోత్పత్తిపై రైతులకు ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చని పేర్కొన్న ఆయన.. పంటల వారీగా విత్తనోత్పత్తిపై అవగాహన కల్పించారు. మధిర విత్తన పరిశోధన కేంద్రం ప్రధాన ఽశాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణి, విత్తన పరిశోధన, సాంకేతిక విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రభావతి, డాక్టర స్వర్ణలత మాట్లాడగా కేవీకే, మధిర పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ జె.హేమంత్‌కుమార్, డాక్టర్ కె.రవికుమార్, డాక్టర్ వి.చైతన్య, డాక్టర్ జెస్సీ సునీత, ఫణిశ్రీ, డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ భరత్ పాల్గొన్నారు,