
రామ్మూర్తిని సన్మానిస్తున్న నాయకులు
సత్తుపల్లిటౌన్/తల్లాడ/సత్తుపల్లి రూరల్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే వరకు పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పిండిప్రోలు రామ్మూర్తి తెలిపారు. సత్తుపల్లి లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పా టు చేసిన రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నా, చట్టసభల్లో లేకపోవటంతో వెనుకబడుతున్నందున ఉద్యమాలు ఉధృతం చేస్తున్నట్లు తెలి పారు. ఈమేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యాన వచ్చే నెల 3, 4వ తేదీల్లో చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జిల్లా నుంచి బీసీలు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం రామ్మూర్తిని పలువురు సన్మానించారు. ఇక తల్లాడలో జరిగిన రామ్మూర్తి మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న బీసీలందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో నాయకులు రాజబోయిన ప్రసాదరావు, ఏలూరి రవి, వేముల వెంకట్, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, ఎల్.మహేష్, ఎం.వెంకటాచారి, వెంకట్రామయ్య, పి.రామారావు, వెంకటేశ్వర్లు, వీరబ్రహ్మాచారి, సత్యం, కృష్ణ పాల్గొన్నారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి రామ్మూరి ఆర్థికసాయం అందజేశారు.